విద్యాసంస్థల్లో ఆహార పదార్థాల సరఫరా టెండర్లు ఖరారు

PDPL: పెద్దపల్లి జిల్లాలోని ఎస్సీ, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల సరఫరా టెండర్లు ఖరారు చేశామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో గురుకుల విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల సరఫరాకు దాఖలైన టెండర్లను ఓపెన్ చేశారు. ఈ కార్య క్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మొహమ్మద్ మేరాజ్ పాల్గొన్నారు.