శాకాంబరి అలంకరణలో దర్శనమిస్తున్న సుబ్బాలమ్మ తల్లి

కోనసీమ: అమలాపురం పట్టణ గ్రామ దేవత శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారు బుధవారం శాకాంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కావడంతో అమ్మవారిని ప్రత్యేక కూరగాయలు, పండ్లతో అలంకరించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.