18న మునుగోడు సంత వేలం

18న మునుగోడు సంత వేలం

NLG: మునుగోడు మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే కూరగాయల సంత వేలం ఈనెల 18న నిర్వహించనున్నట్లు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సంత లీజు ఈనెల 25 నుంచి 2026 మార్చి వరకు ఉంటుందని, వేలం పాడేందుకు ఆసక్తికలిగిన వ్యక్తులు ఈనెల 17వ తేదీ సాయంత్రం లోపు మునుగోడు పంచాయతీ పేరుమీద రూ.40వేలు డీడీ తీసి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు.