ఆటో నుంచి కింద పడి బాలుడు దుర్మరణం

CTR: బాలుడు మృతి చెందిన ఘటన తంబళ్లపల్లెలో శనివారం జరిగింది. కుటుంబీకుల కథనం..ఆర్ఎన్ తాండాకు చెందిన మహేష్ నాయక్ కొడుకు అక్షయ(10) పుంగనూరులో చదువుతున్నాడు. పండుగకు వచ్చిన కొడుకును స్కూల్లో వదిలేందుకు ఆటోలో వెళుతుండగా, ఆటో నడుపుతున్న తండ్రి పక్కనే కూర్చొన్నాడు. దాదంవారిపల్లె వద్ద గుంతలరోడ్డులో వెళ్లడంతో కింద పడి బాలుడు మృతి చెందినట్లు తెలిపారు.