'జనాభా గణనను నిబంధనల ప్రకారం నిర్వహించాలి'
SRPT: జనాభా గణనను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అధికారులను ఆదేశించారు. కోదాడ పట్టణంలోని KRR డిగ్రీ కళాశాలలో జరుగుతున్న గణన శిక్షణ తరగతులను ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు శిక్షణలో అప్రమత్తంగా ఉండి,తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. జనాభా గణనను ఏ ఇంటిని విడిచిపెట్టకుండా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలన్నారు.