అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
HYD: ఏపీకి చెందిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ గోల్కొండ డీసీపీ చంద్రమోహన తెలిపారు. నిందితుడి నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన శివారెడ్డిగా గుర్తించారు. కాగా, ఏప్రిల్ 13న హైదరాబాద్కు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో దొంగతనానికి పాల్పడ్డాడని డీసీపీ వెల్లడించారు.