‘ప్రజల వినతులకు స్పందించిన ఎమ్మెల్యే’

E.G: కొవ్వూరులో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ పింఛన్లు, మంచినీటి సౌకర్యం వంటి సమస్యలపై 11 మంది వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ముప్పిడి హామీ ఇచ్చారు.