ఆర్మీ దాడులు.. 34 మంది మృతి

ఆర్మీ దాడులు.. 34 మంది మృతి

మయన్నార్ పశ్చిమ రఖైన్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో ఉన్న రెబల్ గ్రూప్‌పై ఆ దేశ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 34 మంది మరణించారు. వీరిలో 17 మంది మహిళలు, 17 మంది పురుషులు ఉన్నారు. మరో 80 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశ పౌరులపై మయన్మార్ ఆర్మీ దాడి చేయటం ఇది రెండోసారి కావటం విశేషం.