'పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి'
MNCL: వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మంచిర్యాల జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు దుర్గాప్రసాద్ అన్నారు. నెన్నెలలోని SC బాలుర వసతి గృహాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించాలని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సిబ్బందికి సూచించారు. వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్, హాస్టల్‌కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.