సోమేశ్వర స్వామికి గజవాహనం బహుకరణ

CTR: పుంగనూరు నగరి వీధిలో శ్రీ ప్రసన్న పార్వతి దేవి సమేత సోమేశ్వర స్వామివారికి గజవాహనాన్ని బహూకరించారు. పట్టణానికి చెందిన పుష్పావతమ్మ రూ. 2.50 లక్షల విలువైన వాహనాన్ని ఆలయ కమిటీకి గురువారం అందజేశారు. షణ్ముగ దీక్షితులు ఆ వాహనానికి సంప్రోక్షణ చేసి పూజలు నిర్వహించారు. పుష్పావతమ్మకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.