వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం

వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభం కానుంది. మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు (శుక్రవారం శ్రీరామనవమి, శని, ఆదివారం వారాంతపు సెలవులు) రాగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.