రేపటి నుంచి శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు
NLG: నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఈనెల 24 నుంచి 26 వరకు శ్రీ ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపనున్నట్లు దేవస్థాన కమిటీ వారు తెలిపారు. 24న స్వామివారికి అభిషేకం, 25న నవగ్రహ హోమము, 26న స్వామివారి రథోత్సవం ఉంటుందని తెలిపారు. ఉగాది పర్వదినం తర్వాత వచ్చే తొలి మంగళవారం జాతర ప్రారంభమవడం ఇక్కడి ప్రత్యేకతగా కమిటీ వారు పేర్కొన్నారు.