'లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు చేయండి'

నంద్యాల: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంలో నిర్దేశించిన అంశాలను పకడ్బందీగా అమలు చేస్తూ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ, ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమాల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.