అధిక ఫీజులు వసూళ్లు.. తల్లిదండ్రులు ధర్నా
HYD: ఉప్పల్ సిద్ధార్ధ పబ్లిక్ స్కూల్‌లో అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న MLC తీన్మార్ మల్లన్న అక్కడికి చేరుకుని స్కూల్ యజమాన్యంతో మాట్లాడారు. ప్రతి సం. 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచుకుంటూ పోతే తల్లిదండ్రులు చెల్లించలేరని తెలిపారు. సమస్య పూర్తయ్యే వరకు బాధితులకు అండగా ఉంటానని హామి ఇచ్చారు.