ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ నోట్ల దందా.. ఐదుగురు అరెస్ట్

నకిలీ నోట్లను తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.59 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు 6 ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, కలర్ ప్రింటర్, ఆధార్ కార్డులను సీజ్ చేశారు. ఇన్‌స్టా వేదికగా దండాను నడుపుతున్నారని రూ.250 తీసుకుని నకిలీ రూ.500 నోట్లు ఇస్తున్నారని పోలీసులు తెలిపారు.