‘ఈనెల 7న పంచాయతీ వేలం పాట’
NDL: బనగానపల్లె గ్రామపంచాయతీ పరిధిలో వివిధ వ్యాపార నిర్వహణకు ఈనెల 7వ తేదీన వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఈవో సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. దినసరి కూరగాయల మార్కెట్, వారపు సంత, వాహన పార్కింగ్ వంటి వాటికి బహిరంగ వేలం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు తమ పేర్లను ముందుగానే పంచాయితీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.