చంద్రగ్రహణం.. ఐనవోలు మల్లన్న ఆలయం మూసివేత

HNK: ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయం మూసివేసి, స్వామి వారి దర్శనం, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి కె. సుధాకర్ తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.