'CC కెమెరాలు ప్రజాభద్రత బాధ్యతకు నిదర్శనం'
RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు నేర నియంత్రణకు సహాయపడుతుందన్నారు. ఇవి ప్రజా భద్రత బాధ్యతకు నిదర్శనం అని, ప్రతి కాలనీ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని అన్నారు.