VIDEO: ఆగని ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

VIDEO: ఆగని ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

HNK: ఐనవోలు పరిధిలోని ఆకేరు వాగులో ఇసుక మాఫియా ట్రాక్టర్లు, జేసీబీలతో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తోంది. మోటార్ల సాయంతో రోడ్డు పక్కనే ఇసుకను కడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ వాగు నీరు కలుషితమవుతూ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇసుక మాఫియాను అరికట్టాలని కోరారు.