VIDEO: పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనం

VIDEO: పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనం

ASF: బెజ్జూర్ పెట్రోల్ బంక్‌లో స్టాక్ పూర్తిగా ఖాళీ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం బంక్ వద్దకు వచ్చిన వినియోగదారులకు 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బంక్ సిబ్బంది చెబుతున్నారు. అత్యవసర పనుల మీద వెళ్లే వారు పెట్రోల్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.