నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం
BHNG: గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను బొంధుగుల సర్పంచి పయ్యావుల ఎల్లయ్య గ్రామ పెద్దలు కోరారు. బుధవారం ఆయనను కలసి గ్రామంలోని సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లయ్య, ఉపసర్పంచ్ అబిద్ వార్డు సభ్యుడు శీను, రమేష్, గ్రామస్తులు సిద్దులు, రాజు, రాములు, కిషన్, కనుకయ్య, మహేష్, తదితరులు పాల్గొన్నారు.