ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

SRPT: మునగాల మండలం బరకత్ గూడెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యాన్ని త్వరగా తూకం వేసి రైస్ మిల్లులకు పంపాలని, రైతులు తమ ధాన్యంపై టార్పాలిన్స్ కవర్లు కప్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.