'పెండింగ్ స్కాలర్షిప్‌లను విడుదల చేయాలి'

'పెండింగ్ స్కాలర్షిప్‌లను విడుదల చేయాలి'

NRML: పెండింగ్ స్కాలర్షిప్ లను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.