పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా బరంపూర్
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బరంపూర్ గ్రామం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 69 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతున్న బరంపూర్ సర్పంచ్ స్థానానికి ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో 69 ఏళ్ల అనంతరం తొలిసారిగా గ్రామ ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. కాగా.. బరిలో ఇద్దరు అభ్యర్థులు నిలిచారు.