నేడు జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన
NGKL: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుని, మెడికల్ కళాశాలలో క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB)ను ప్రారంభిస్తారని కలెక్టర్ బధావత్ సంతోష్ తెలిపారు. అంతకుముందు ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి, అనంతరం ఇక్కడి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.