సీఎంను కలిసిన ఆర్‌డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్
ATP: CM చంద్రబాబును అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ కలిశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) నిబంధనల వల్ల ఆగిపోయిన నిధుల విడుదలకు కేంద్రం క్లియరెన్స్ ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి కృషి చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.