విజయవాడలో ముస్తాబు అయిన చర్చిలు

విజయవాడలో ముస్తాబు అయిన చర్చిలు

NTR: క్రైస్తవులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా, విజయవాడలోని పలు చర్చిలను విద్యుత్ దీప కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. చర్చిలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కిట్స్, పాటలతో ఏసుక్రీస్తు జననం గురించి వివరించారు.