ఆర్సీబీ కొత్త బాస్ ఎవరంటే?

ఆర్సీబీ కొత్త బాస్ ఎవరంటే?

యాజమాన్య మార్పుతో RCB కొత్త బోర్డు కొలువుదీరింది. ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా చైర్మన్‌గా, టైమ్స్ గ్రూప్ సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కన్సార్టియంలో బోల్ట్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. RCB టీంను గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని కొత్త యాజమాన్యం ప్రకటించింది.