ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

KNR: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని సొంత గ్రామం వీణవంకలోని ప్రభుత్వ పాఠశాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భార్య శాలినితోపాటు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి ఒక్క పౌరుడు తన హక్కుగా వినియోగించుకోవాలని కోరారు.