కేశవాపురంలో చైన్ స్నాచింగ్ కలకలం..!

కేశవాపురంలో చైన్ స్నాచింగ్ కలకలం..!

KMM: కూసుమంచి మండలం కేశవాపురంలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన బెల్లం సత్యమయ్య సతీమణి సావిత్రి మెడలోని సుమారు నాలుగు తులాల బంగారం గొలుసును గుర్తుతెలియని దుండగులు పల్సర్ బైక్‌పై వచ్చి లాక్కెల్లి ఖమ్మం వైపు వెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూసుమంచి ఎస్సై నాగరాజు సిబ్బందితో కలిసి దుండగుల కోసం గాలిస్తున్నారు.