VIDEO: మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాస సందడి
NDL: మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాస సందడి నెలకొంది. కార్తీక మాసం ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మహానందికి తరలివచ్చారు. స్థానిక కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకార్చన పూజలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.