'సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి'

SDPT: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట జిల్లా వైద్యాధికారి సీహెచ్ ధన్ రాజ్ సూచించారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు 24/7 అందుబాటులో ఉండాలన్నారు. వర్షాకాలం అయినందున ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ శ్రీనివాస్ ఉన్నారు.