రేపు మరోసారి కేంద్ర కేబినెట్ భేటీ

రేపు మరోసారి కేంద్ర కేబినెట్ భేటీ

రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పహల్గామ్ దాడి తర్వాత మూడోసారి సీసీఎస్ భేటీ అవనుంది. దేశ భద్రత, పాక్‌పై తీసుకోవాల్సిన చర్యలు.. వాటి అమలు తీరు పరిశీలన, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.