ఈనెల 27న సామాజిక తనిఖీ ప్రజావేదిక

ఈనెల 27న సామాజిక తనిఖీ ప్రజావేదిక

ASF: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమాల సామాజిక తనిఖీ ప్రజావేదికను ఈనెల 27న బెజ్జుర్ MPDO కార్యాలయంలో నిర్వహించనున్నట్లు MPDO ప్రవీణ్ శుక్రవారం తెలిపారు. ఇది వరకే సామాజిక తనిఖీ బృందాలు, ఉపాధి హామీ పనులను క్షేత్ర పరిశీలన చేశామన్నారు. ఈనెల 27న నిర్వహించే ప్రజావేదికకు ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరవ్వాలన్నారు.