కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది: కేసీఆర్
TG: జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాలలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేవలం జగిత్యాలలోనే కాదు.. పక్కన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కనుమరుగు కానుందన్నారు. ఇది కాంగ్రెస్ వాళ్లు చేసిన సర్వేలోనే బయటపడిందని చెప్పారు. అయితే కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ భారీగా నినాదాలు చేస్తున్నారు.