VIDEO: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
SKLM: కోటబొమ్మాలి(M) కేంద్రంలోని హాత్కో కాలనీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు.