నిర్ణీత గడువులోగా చట్టపరమైన పరిష్కారం: ఎస్పీ

నిర్ణీత గడువులోగా చట్టపరమైన పరిష్కారం: ఎస్పీ

సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా 80 అర్జీలను స్వీకరించారు. కుటుంబ, ఆస్తి, ఆర్థిక వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా చట్టపరమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.