డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డ పెనుమూడి వారధి మధ్యలో కారు అదుపుతప్పి వారధి డివైడర్‌ని ఢీకొట్టింది. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తుండగా.. ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు తెనాలికి చెందినవారని సమాచారం. వారధి సిమెంట్ బీమ్ విరిగినా కారు కృష్ణా నదిలో పడకుండా వెనక్కి రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం తెనాలికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.