VIDEO: తంగళ్ళపల్లిని తాకిన అప్పర్ మానేరు డ్యామ్ వరద

SRCL: అప్పర్ మానేరు ప్రాజెక్ట్ నుంచి భారీగా విడుదలైన వరద జలాలు బుధవారం సాయంత్రం తంగళ్ళపల్లి మండలాన్ని తాకి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని గ్రామాల పరిసరాల్లో నీరు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపలు పట్టేందుకు లేదా చూడటానికి ఎవరూ డ్యాం వైపు గాని,చెరువులు, కుంటల వైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.