గౌతమ్ నగర్ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు..!

మేడ్చల్: మల్కాజ్గిరి పరిధి గౌతమ్ నగర్ డివిజన్ ప్రాంతాల్లోని అనేక చోట్ల మంచినీటి సరఫరాలో ప్రెజర్ సమస్య అత్యధికంగా ఉంటున్నట్లు అక్కడి ప్రజలు వాపోతున్నారు. మల్లికార్జున నగర్, మిర్జాల్ గూడ, హనుమాన్ పేట, గోపాల్ నగర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. గంట నీరు రావాల్సి ఉండగా 45 నిమిషాలు మాత్రమే వస్తున్నట్లు పేర్కొన్నారు.