'KGBV ఘటనపై ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలి'

'KGBV ఘటనపై ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలి'

KRNL: నందవరం కేజీబీవీ పాఠశాలలో జరిగిన ఆహార ఘటనపై ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజా దేశాయ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న బల్లి పడిన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారని ఆరోపించారు. ఆ భోజనం తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.