వీకెండ్ వేట.. మాదాపూర్‌లో హైడ్రా యాక్షన్
TG: వీకెండ్ స్పెషల్ డ్రైవ్ అంటూ హైడ్రా అధికారులు మళ్లీ జేసీబీలకు పని చెప్పారు. HYDలోని మాదాపూర్ నుంచి మైండ్ స్పేస్ వెళ్లే రూట్‌లో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించారు. రోడ్డుకు అడ్డంగా, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి కట్టిన షాపులను కూల్చేస్తున్నారు. శనివారం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ పని కానిచ్చేస్తున్నారు. దీంతో ఆ ఏరియాలో ఒక్కసారిగా కలకలం రేగింది.