డబ్బాలలో పెట్రోల్ పోయొద్దు: మంత్రి ఉత్తమ్
TG: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రెండు నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందన్నారు. ప్రజలు బంక్‌ల దగ్గర క్యూలు కట్టొద్దన్నారు. డ్రమ్ములు, కంటైనర్లు, డబ్బాలలో పెట్రోల్ పోయొద్దని బంకులకు మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో వాణిజ్య గ్యాస్ కొరత ఉందన్నారు.