2027 వరల్డ్ కప్‌లో RO-KO ఆడాలి: సౌథీ
భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్‌లో ఆడాలని, వారికి ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమేనని NZ మాజీ ప్లేయర్ టిమ్ సౌథీ అన్నాడు. ఇప్పటికీ RO-KO తమ ఆటతో రాణిస్తున్నారని, వారి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. ఆటలో కొనసాగడానికి కావాల్సిన విధంగా వారు ఆడుతున్నందున.. టీమ్ మేనేజ్మెంట్ కూడా వారితో ఆడించాలని అనుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.