ఆత్కూరులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

ఆత్కూరులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ అంకూరి నాగమల్లేశ్వరరావు డ్రైనేజీలను పరిశీలించారు. కలుషిత వాతావరణంలో జీవిస్తున్న నేపథ్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి ట్యాంకుల కడిగింపు, క్లోరినేషన్ రిజిస్టర్ నిర్వహణపై ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.