VIDEO: 'పనులు త్వరగా పూర్తి చేయాలి'
ములుగు జిల్లాలోని ఇంచర్ల శివారు ఎర్రి గట్టమ్మలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనంను కలెక్టర్ దివాకర టీఎస్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగం, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ, ఫ్లోరింగ్, పెయింటింగ్ తదితర పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.