వ్యక్తి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పద మృతి

NLG: నల్గొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన నేతకాని సుదర్శన్ (45) ఉరి వేసుకుని మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.