బట్టుపల్లి కళాశాల విద్యార్థి అదృశ్యం

బట్టుపల్లి కళాశాల విద్యార్థి అదృశ్యం

HNK: కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టుపల్లి గ్రామంలోని ప్రముఖ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కేసరి శివరాం రెడ్డి (17) గురువారం కళాశాల నుంచి కనిపించకుండా పోయాడు. బాలుడి అదృశ్యంపై తండ్రి రవీందర్ రెడ్డి కళాశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ కిషన్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.