గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం

గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో భూభారతి భూముల రీ సర్వే సోమవారం చేపట్టారు. సంబంధిత అధికారులు మల్కాపూర్, వెంకటాయపల్లి, నర్సంపల్లి శివారులలో సర్వే ప్రారంభించారు. రైతులు గ్రామ సరిహద్దులు నిర్ధారణ చేసే సమయంలో అందుబాటులో ఉండాలని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు. ఇందులో సర్వేలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సర్వే లక్ష్మీ సుజాత, సర్వేయర్ నర్సింగరావు, సర్పంచ్ హరీష్ గౌడ్ పాల్గొన్నారు.