వివాహితపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు
GNTR: అరండల్ పేటలో ఓ వివాహితపై తప్పుడు ప్రచారం చేస్తూ, బెదిరిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంజీవ్ గాంధీనగర్‌కు చెందిన మారుతి తిరుమల అనే వ్యక్తి ఓ వివాహితను అక్క అని పిలుస్తూనే, బయటి వారికి ప్రేయసిగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కాపురం చెడగొడతానన్నాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.